Mahesh Babu: మరీ చిన్నవాడైపోతున్న మహేశ్ బాబు... ఫొటోలు ఇవిగో!

Mahesh Babu shares his latest pics

  • షార్ప్ గా కనిపిస్తున్న మహేశ్ బాబు
  • జీరో ఫ్యాట్ లుక్ తో మరింత ఆకర్షణీయంగా సూపర్ స్టార్
  • అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రోజుకురోజుకు మరింత నాజూకుగా తయారవుతున్నాడు ఇటీవల ఆయన పిక్స్ చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. మహేశ్ బాబు సహజంగానే అందగాడు... ఇప్పుడు ఇంకాస్త సన్నబడడంతో ఆ అందం రెట్టింపైంది. 

తాజాగా 'బీటీఎస్' అంటూ మహేశ్ బాబు తన తాజా స్టిల్స్ ను పంచుకున్నారు. మునుపటి కంటే ఇంకా ఆకర్షణీయంగా, వెరీ షార్ప్ లుక్ తో కనిపిస్తున్న జీరో ఫ్యాట్ మహేశ్ ను ఈ ఫొటోల్లో చూడొచ్చు. ఇక ఈ లేటెస్ట్ స్టిల్స్ పై అభిమానుల స్పందన అంతాఇంతా కాదు. తమ అభిమానాన్ని కామెంట్ల రూపంలో వెల్లువలా కురిపిస్తున్నారు. 

మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు.

Mahesh Babu
Pics
Superstar
MB
Tollywood
  • Loading...

More Telugu News