Prabhas: 'ఆదిపురుష్'లో ప్రభాస్ లుక్ పై సినీ నటి కస్తూరి విమర్శలు

Actor Kasturi comments on Prabhas look in Adipurush

  • రాముడు, లక్ష్మణుడిని మీసాలతో చూపించడమేంటని ప్రశ్నించిన కస్తూరి
  • రాముడిలా కాకుండా కర్ణుడిలా ప్రభాస్ కనిపిస్తున్నాడని విమర్శ
  • కస్తూరి వ్యాఖ్యలపై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్

ప్రభాస్, కృతి సనన్ జంటగా 'ఆదిపురుష్' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఈ చిత్రంలో రాముడి పాత్రను పోషించిన ప్రభాస్ లుక్ పై సినీ నటి కస్తూరి విమర్శలు చేశారు. ప్రభాస్ లుక్ చూస్తుంటే ఆయన రాముడిలా లేరని, కర్ణుడిలా ఉన్నారని అన్నారు. రాముడిని, లక్ష్మణుడిని మీసాలతో చూపించడం ఏమిటని ప్రశ్నించారు. తెలుగు సినిమాల్లో ఎంతో మంది నటులు రాముడి పాత్రల్లో తెరపై ఎంతో అందంగా కనిపించారని... కానీ ప్రభాస్ మాత్రం కర్ణుడిలా కనిపిస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇదే సమయంలో కొందరు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.

Prabhas
Adipurush
Sri Ram
Kasturi
Tollywood
  • Loading...

More Telugu News