Jaishankar: రాహుల్ గాంధీ కాదు.. మీకు మంత్రి పదవి ఇచ్చిన వ్యక్తే దీన్ని ప్రారంభించారు: జైశంకర్ పై జయరాం రమేశ్ ఫైర్

Jairam Ramesh fires on Jaishankar for remarks on Rahul Gandhi

  • విదేశాల్లో దేశ రాజకీయాల గురించి రాహుల్ మాట్లాడుతున్నారన్న జైశంకర్
  • దీన్ని ప్రారంభించింది మోదీనే అన్న జైరామ్ రమేశ్
  • గత ప్రభుత్వాల గురించి మోదీ చులకనగా మాట్లాడారన్న సూర్జేవాలా

విదేశీ పర్యటనల్లో మన దేశం గురించి కించపరిచేలా మాట్లాడటం, దేశ రాజకీయాలపై కామెంట్లు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందంటూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విమర్శించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంపై ప్రతి రోజు విమర్శలు చేస్తూనే ఉంటారని... అయితే వారి విమర్శలకు దేశ ప్రజల నుంచి స్పందన రాకపోతే... విదేశాలకు వెళ్లి విమర్శిస్తారని అన్నారు. బయటి దేశాల మద్దతు మన దేశంలో పని చేస్తుందా? అని ప్రశ్నించారు. మన దేశంలో రాహుల్ ఏం చేసినా పర్వాలేదని... మన అంతర్గత విషయాలను విదేశాల్లో ప్రస్తావించడం సరికాదని అన్నారు. 

ఈ నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ మండిపడ్డారు. విదేశాల్లో మన దేశ రాజకీయాల గురించి మాట్లాడటాన్ని ప్రారంభించింది రాహుల్ కాదని... ఆ పనిని ప్రారంభించింది మీకు మంత్రి పదవి ఇచ్చి వ్యక్తి (మోదీ) అని అన్నారు. దేశ రాజకీయాల గురించి విదేశీ వేదికలపై మాట్లాడటాన్ని మోదీనే ప్రారంభించారని... ఈ విషయం మీకు కూడా తెలుసని... అయితే ఆ విషయం గురించి మాత్రం మీరు మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీస్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ... జైశంకర్ కు బీజేపీ పాత స్క్రిప్టునే ఇచ్చిందని, దాన్ని ఆయన కొత్తగా చదివారని అన్నారు. విదేశాల్లో మోదీ మాట్లాడుతూ గత ప్రభుత్వాల గురించి చులకనగా మాట్లాడారని.... 70 ఏళ్ల దేశ చరిత్రను అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలపైన పక్కా ప్రణాళికతో దాడి చేస్తున్నారనే నిజాన్ని మాత్రమే అమెరికాలో రాహుల్ చెప్పారని అన్నారు.

Jaishankar
Narendra Modi
BJP
Jairam Ramesh
Rahul Gandhi
Congress
  • Loading...

More Telugu News