Nirmala Sitharaman: నిరాడంబరంగా... ఇంటి వద్దే నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం

Sitharamans Daughter Gets Married In A Simple Home Ceremony

  • ఢిల్లీలోని నిర్మల నివాసంలో ఒక్కటైన పరకాల వాంగ్మయి-ప్రతీక్
  • కొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో పెళ్లి
  • పెళ్లి సమయంలో తీసిన 'సింప్లిసిటీ' ఫోటోలు వైరల్

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె వాంగ్మయి వివాహం ఢిల్లీలో నిరాడంబరంగా జరిగింది. కొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో పరకాల వాంగ్మయి వివాహం ప్రతీక్ తో జరిగింది. నిర్మల నివాసంలో జరిగిన ఈ వివాహ వేడుకకు రాజకీయ ప్రముఖులు ఎవరూ హాజరు కాలేదని తెలుస్తోంది. ఉడిపి అదమరు మఠ్ కు చెందిన పురోహితులు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు.
 
ఈ ప్రత్యేక కార్యక్రమానికి వధువు గులాబీ రంగు చీరను ఆకుపచ్చ బ్లౌజ్ తో ధరించింది. వరుడు తెల్లని పంచె, శాలువా ధరించాడు. వధువు తల్లి నిర్మలా సీతారామన్ మొలకాల్మూరు చీరను ధరించారు. పెళ్లి సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Nirmala Sitharaman
marriage
  • Loading...

More Telugu News