DK Aruna: పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన డీకే అరుణ

DK Aruna clarifies on party change news

  • ఓ తెలుగు పేపర్లో ఆ వార్తలు వస్తున్నాయన్న డీకే అరుణ
  • ఆ పార్టీ ఎవరి కనుసన్నల్లో నడుస్తోందో అందరికీ తెలుసని వెల్లడి
  • బీజేపీని వదిలి ఎక్కడికీ వెళ్లబోనని స్పష్టీకరణ

తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టతనిచ్చారు. ఓ తెలుగు న్యూస్ పేపర్లో ఈ వార్తలు వస్తున్నాయని, ఆ పేపర్ ఎవరి కనుసన్నల్లో నడుస్తోందో అందరికీ తెలుసని అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలతో పాత్రికేయ విలువలు పతనం అవుతున్నాయని విమర్శించారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని, తాను బీజేపీలోనే ఉంటానని డీకే అరుణ వెల్లడించారు. 

తనపై బీజేపీ ఎంతో నమ్మకం ఉంచి జాతీయ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చిందని, అలాంటప్పుడు తాను పార్టీని వదిలి ఎందుకు వెళ్లిపోతానని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే పరువునష్టం దావా వేస్తానని డీకే అరుణ స్పష్టం చేశారు. డీకే అరుణ 2019లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

DK Aruna
BJP
Congress
Telangana
  • Loading...

More Telugu News