Visakhapatnam: విశాఖలో ఏడాదిన్నర బాలుడి కిడ్నాప్ కలకలం

Telangana boy kidnapped in Visakha
  • యాదాద్రి జిల్లా నుండి నిన్న రాత్రి కొడుకుతో కలిసి విశాఖ చేరుకున్న మహిళ
  • రాత్రి రైల్వే స్టేషన్ లో నిద్రించిన సమయంలో కొడుకు కిడ్నాప్
  • తనతో పాటు ఉన్న ఒడిశా జంట కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం
విశాఖ రైల్వే స్టేషన్ లో గురువారం ఏడాదిన్నర బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా నుండి నిన్న రాత్రి రైల్లో ఏడాదిన్నర కుమారుడితో కలిసి ఓ గర్భిణీ విశాఖకు చేరుకుంది. రాత్రి నుండి విశాఖ రైల్వే స్టేషన్ లోనే ఉంది. ఆ తల్లి స్టేషన్ లో నిద్రించిన సమయంలో ఏడాదిన్నర బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. తనతో పాటు స్టేషన్ లోనే ఉన్న ఒడిశాకు చెందిన ఓ జంట తన కొడుకుని కిడ్నాప్ చేసి ఉంటారని ఆ గర్భిణీ ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు.
Visakhapatnam
kidnap
Telangana

More Telugu News