Nara Lokesh: వేటాడకపోతే పులులు కూడా పిల్లులవుతాయ్: నారా లోకేశ్

  • కడప జిల్లాలో లోకేశ్ యువగళం
  • పులివెందుల టీడీపీ కార్యకర్తలు, నేతలతో లోకేశ్ సమావేశం
  • ఢీ అంటే ఢీ అనేవాళ్లనే తాను గుర్తిస్తానని స్పష్టీకరణ
  • కేసులకు భయపడి ఇంట్లో ఉంటామంటే ప్రజలు హర్షించరని వెల్లడి
  • ఇన్చార్జి వ్యవస్థలను ఎత్తివేస్తున్నామని వివరణ
Lokesh held meeting with Pulivendula TDP cadre

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 120వ రోజు కడప రాజరాజేశ్వరి కళ్యాణ మండపం వద్ద నుంచి ప్రారంభమైన చలమారెడ్డిపల్లి మీదుగా టక్కోలు వద్ద రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. టీడీపీ ఇన్చార్జి చెంగల రాయుడు, గంటా నరహరి, నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో లోకేశ్ కు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులతో నీరాజనాలు పడుతూ తమ గ్రామాల్లోకి ఆహ్వానించారు.

జయంతికి, వర్ధంతికి రావడం తప్ప జగన్ చేసిందేమిటి?

గతంలో పులివెందులలో టీడీపీ గెలవకపోయినా ఎప్పుడూ చిన్న చూపు చూడలేదని, అన్ని నియోజకవర్గాల లాగే పులివెందులను అభివృద్ది చేశామని నారా లోకేశ్ వెల్లడించారు. కడప రాజరాజేశ్వరి కళ్యాణ మండపం వద్ద పులివెందుల టీడీపీ కార్యకర్తలు, నాయకులతో లోకేశ్ సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పులివెందులకు నీరు ఇచ్చింది టీడీపీ అని స్పష్టం చేశారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని. రాజకీయ అవకాశాలు కూడా ఎక్కువ కల్పించామని చెప్పారు. 

"పులివెందుల ప్రజలు కూడా జగన్ బాధితులే. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు అనుకున్న మేర పులివెందులలో జరగలేదు. మనలో మార్పు రావాలి.. ప్రజలకి దగ్గర అవ్వాలి. ప్రజా సమస్యలపై పోరాడినప్పుడే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు" అని పార్టీ శ్రేణులకు సూచించారు. 

"90 వేల మెజారిటీతో గెలిపిస్తే పులివెందులు జగన్ చేసింది ఏంటి? జగన్ సీఎం అయ్యాక పులివెందులకు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? రోడ్లు వేశాడా? కోట్ల రూపాయలు మంజూరు చేశాను అంటున్నాడు... ఒక్క రూపాయి విడుదల చేశాడా? జయంతి, వర్ధంతికి రావడం తప్ప జగన్ పులివెందులకు చేసింది ఏంటి అని నా సూటి ప్రశ్న. 

పార్టీలో సీనియర్, జూనియర్లు ను సమానంగా గౌరవిస్తా. కానీ పని చేసే వారికే పదవులు ఇస్తా. మీ బూత్ లో మెజారిటీ తెస్తేనే పదవులు ఇస్తాం. నాయకులు అందరూ నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి. కేసులకు భయపడి ఇంట్లో పడుకుంటాం అంటే ప్రజలు హర్షించరు. పోరాడిన వారికే ప్రజల మద్దతు ఉంటుంది. 

గ్రూప్ రాజకీయాలని ప్రోత్సహించం. భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమం పులివెందుల లో పక్కగా నిర్వహించాలి. నియోజవర్గంలో పనిచేయకుండా పదవులు అడగొద్దు" అని స్పష్టం చేశారు.

ప్రజాదరణ ఉంది... దాన్ని అందిపుచ్చుకోండి! 

కడప జిల్లాలో టీడీపీకి పెద్ద ఎత్తున ఆదరణ ఉందని, దానిని నాయకత్వం అందిపుచ్చుకోవాలని లోకేశ్ పిలుపునిచ్చారు. పులి వేటకి వెళ్లకపోతే పిల్లి అవుతుంది అని వ్యాఖ్యానించారు. "టీడీపీ నాయకులు అంతా పోరాడాలి. పులివెందులలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు ఏమి జరగడం లేదు. 

పులివెందులకు చెందిన నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి గౌరవించాం. ఓడిపోయినా ఇన్చార్జిగా ఉండి పెత్తనం చెయ్యాలి అనుకుంటే ఇక కుదరదు. ఇన్చార్జి వ్యవస్థ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అధికారంలోకి వచ్చాక, టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన అధికారులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి సర్వీస్ నుండి తొలగిస్తాం. ఢీ అంటే ఢీ అనే వాళ్ళనే నేను గుర్తిస్తాను.

*యువగళం వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1528.9 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 12.1 కి.మీ.*

*121వ రోజు పాదయాత్ర వివరాలు (9-6-2023):*

*రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం (అన్నమయ్య జిల్లా):*

సాయంత్రం

4.00 – చంటిగారిపల్లె క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.10 – చంటిగారిపల్లెలో స్థానికులతో సమావేశం.

4.40 – మూలపల్లెలో స్థానికులతో సమావేశం.

5.40 – సిద్ధవటం పెన్నానది వద్ద స్థానికులతో మాటామంతీ.

6.00 – సిద్దవటంలో స్థానికులతో మాటామంతీ.

6.10 – సిద్ధవటం ఎమ్మార్వో ఆఫీసు వద్ద బహిరంగసభ, లోకేష్ ప్రసంగం.

7.55 – కమ్మపాలెం శివార్లలో స్థానికులతో మాటామంతీ.

8.05 – కమ్మపాలెం జంక్షన్ లో స్థానికులతో సమావేశం.

8.15 – జంగాలపల్లి ఆంజనేయస్వామి గుడి వద్ద విడిది కేంద్రంలో బస.

******

More Telugu News