Rahul Gandhi: వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికకు ఈసీ ఏర్పాట్లు!

Mock poll held in Kozhikode baffles Congress supporters about Wayanad by election

  • వయనాడ్ లో మాక్ పోలింగ్ నిర్వహణ!
  • గుజరాత్ హైకోర్టులో రాహుల్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న సమయంలో ఏర్పాట్లపై కాంగ్రెస్ ఆగ్రహం
  • అధికారికంగా లేని ఎలాంటి నోటిఫికేషన్

రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో వయనాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాలేదు. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఈవీఎం, వీవీప్యాట్ లను సిద్ధం చేస్తుండటం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈవీఎంల పని తీరు సరిచూసుకొని మాక్ పోలింగ్ నిర్వహిస్తామని కోయ్ కోడ్ డిప్యూటీ కలెక్టర్ సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత మాక్ పోలింగ్ నిర్వహించారు కూడా. 

పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది పెండింగ్ లో ఉన్నప్పటికీ ఈసీ ఉప ఎన్నికకు సన్నాహాలు చేస్తోంది.

ఉప ఎన్నికకు సిద్ధమవుతుండటంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఎన్నికల సంఘం చర్య వెనుక రహస్యం దాగి ఉందని ఆరోపించింది. ఈ కేసు విషయంలో రాహుల్ వేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉండగా కోర్టు ఏం చెబుతుందో ఈసీ ఎలా అంచనా వేయగలదని ప్రశ్నించింది. వయనాడ్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు కనిపిస్తున్నాయని, ఇందులో ఏదో రహస్యం దాగి ఉందని అనుమానించాల్సిందేనని స్థానిక డీసీసీ అధ్యక్షుడు అన్నారు.

Rahul Gandhi
wayanad
Lok Sabha
  • Loading...

More Telugu News