Smriti Irani: ఇదేనా ప్రేమంటే... రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ విమర్శలు

Smriti Irani take a jibe at Rahul Gandhi

  • అమెరికాలో రాహుల్ పర్యటన
  • మొహబ్బత్ కా దుకాణ్ కార్యక్రమంలో ప్రసంగం
  • ఇక ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో, ప్రతి చోట ప్రేమ దుకాణం తెరుచుకుంటుందని వెల్లడి
  • విదేశాల్లో భారత్ పరువు తీయడమేనా ప్రేమంటే? అంటూ స్మృతి ఫైర్

అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొహబ్బత్ కీ దుకాణ్ పేరిట ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, బీజేపీ విద్వేషం పంచితే, కాంగ్రెస్ ప్రేమను పంచుతుందని అన్నారు. 2023 సంవత్సరంలో ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో ప్రేమ దుకాణం తెరుచుకుంటుందని పేర్కొన్నారు. 

దీనిపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ప్రజాస్వామ్యంపై అంత ప్రేమే ఉంటే, పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి ఎందుకు హాజరుకాలేదని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. విదేశాల్లో భారత్ ను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ దేశం పరువు తీయడమేనా ప్రేమంటే? అని నిలదీశారు. 

సిక్కులను దారుణంగా వధించడం, కేరళ స్టోరీ సినిమాపై మౌనంగా ఉండడం, దేశాన్ని దూషించే వారితో కరచాలనం చేయడం, సెంగోల్ ను అవమానించడం ప్రేమ అవుతుందా? అని స్మృతి మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీయడానికి కాంగ్రెస్ నాయకత్వం పరాయి శక్తులను ఉపయోగిస్తోందని విమర్శించారు.

Smriti Irani
Rahul Gandhi
Mohabbat Ka Dukaan
BJP
Congress
  • Loading...

More Telugu News