Nara Lokesh: ఒకే చోట చంద్ర‌బాబు అభివృద్ధి-జ‌గ‌న్ విధ్వంసం అంటూ సెల్ఫీలు తీసి చూపించిన‌ లోకేశ్

Lokesh takes selfies at TIDCO Houses

  • కడప జిల్లాలో లోకేశ్ యువగళం
  • చలమారెడ్డిపల్లి మీదుగా పాదయాత్ర
  • టిడ్కో ఇళ్ల ముందు సెల్ఫీ దిగిన లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర కడప జిల్లాలో కొనసాగుతోంది. ఈ సాయంత్రం యువగళం పాదయాత్ర చలమారెడ్డిపల్లి మీదుగా వెళుతుండగా, అక్కడి టిడ్కో ఇళ్లను చూసి లోకేశ్ ఆగారు. ఆ టిడ్కో ఇళ్ల ముందు లోకేశ్ సెల్ఫీ దిగారు.  చంద్ర‌బాబు పాల‌న‌లో పేద‌ల కోసం స‌క‌ల సౌక‌ర్యాల‌తో టిడ్కో ఇళ్లు నిర్మిస్తే, వైసీపీ సర్కారు రంగులేసుకుందంటూ మండిపడ్డారు. 

అనంతరం, వైసీపీ అనకొండలు చలమారెడ్డిపల్లిలోని పాలకొండని 6 కి.మీ. పొడవునా తవ్వేశారని, ట్రక్కు రూ.5 వేల చొప్పున అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. తాగునీరు, కరెంటు సహా ఎటువంటి మౌలిక సౌకర్యాలు లేని కొండ‌పై పేదలకు సెంటు పట్టాలిచ్చి వైసీపీ డబుల్ దోపిడీకి పాల్పడిందంటూ విమర్శించారు. 

ఇలా ఒకే చోట చంద్రబాబు అభివృద్ధి-జగన్ విధ్వంసం కనిపిస్తున్నాయని లోకేశ్ పేర్కొన్నారు.

Nara Lokesh
Yuva Galam Padayatra
Selfies
Kadapa District
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News