Congress: కాంగ్రెస్ చక్కగా పని చేస్తే ఈ సమస్యలు ఎందుకు?: కేటీఆర్

  • కాంగ్రెస్ 50 ఏళ్లలో చక్కగా పని చేస్తే ఈ యాత్రలు ఎందుకని ప్రశ్న
  • మిషన్ కాకతీయతో చెరువులు నిండాయని వ్యాఖ్య
  • డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్
Minister KTR lashes out at Congress

కాంగ్రెస్ అధికారంలో ఉన్న యాభై ఏళ్లలో చక్కగా పని చేస్తే రాష్ట్రంలో ఈ సమస్యలు ఎందుకు ఉంటాయని, ఇప్పుడు కాంగ్రెస్ వారికి ఈ యాత్రలు ఎందుకని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, కేసీఆర్ పిలుపు మేరకు మిషన్ కాకతీయలో బాగు చేసుకున్న చెరువులకాడ నిండిన నీళ్లను చూస్తూ పండుగ చేసుకున్నామన్నారు.

More Telugu News