Sharwanand: తన పెళ్లి రిసెప్షన్ కు రావాలంటూ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన శర్వానంద్

  • ఇటీవల జైపూర్ లో శర్వానంద్ వివాహం
  • రక్షితా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేసిన శర్వా
  • జూన్ 9న హైదరాబాదులో రిసెప్షన్
Sharwanand invites CM KCR to his wedding reception

టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ వివాహం ఇటీవల జైపూర్ లో ఘనంగా జరిగింది. ఇక్కడి లీలా ప్యాలెస్ లో శర్వానంద్, రక్షితా రెడ్డి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. శర్వా పెళ్లి రాజస్థాన్ లో జరగడంతో పరిమిత సంఖ్యలోనే సెలబ్రిటీలు విచ్చేశారు. దాంతో, రేపు (జూన్ 9) హైదరాబాదులోని ఓ స్టార్ హోటల్లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. 

ఈ క్రమంలో, శర్వానంద్ నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశాడు. తన పెళ్లి రిసెప్షన్ కు రావాలంటూ ఆయనను స్వయంగా ఆహ్వానించాడు. తన నివాసానికి వచ్చిన శర్వాను సాదరంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్... రిసెప్షన్ కు తప్పకుండా వస్తానని తెలిపారు. వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన శర్వానంద్ కు శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News