Balakrishna: బాలయ్య బర్త్ డేకి 'భగవంత్ కేసరి' టీజర్ లాంచ్!

  • బాలయ్య 108వ సినిమాగా 'భగవంత్ కేసరి'
  • ఈ రోజునే విడుదలైన టైటిల్ పోస్టర్ 
  • ఈ నెల 10వ తేదీన ఫస్టు టీజర్ రిలీజ్
  • దసరాకి భారీస్థాయిలో సినిమా విడుదల   
Bhagavanth Kesari teaser release date

బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. సాహు గారపాటి - హరీశ్ పెద్ది భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కెరియర్ పరంగా బాలయ్యకి ఇది 108వ సినిమా. ఈ రోజు ఉదయమే ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

ఈ సినిమాకి 'భగవంత్ కేసరి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ పరంగా .. బాలయ్య లుక్ పరంగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో అప్ డేట్ ను వదిలారు. ఈ నెల 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. 

అనిల్ రావిపూడి ఇంతవరకూ తన సినిమాల్లో అటు కామెడీని .. ఇటు యాక్షన్ ను సమపాళ్లలో బ్యాలెన్స్ చేస్తూ వచ్చాడు. మొదటిసారిగా ఆయన తన మార్క్ కి కాస్త దూరంగా వెళ్లి ఈ సినిమాను చేస్తున్నాడు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, తమన్నా ... శ్రీలీల ముఖ్యమైన పాత్రలను పోషించారు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News