jaishankar: రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రపంచం గమనిస్తోంది: జైశంకర్

Rahul Gandhi has habit of criticising India abroad says Jaishankar

  • విదేశాలకు వెళ్లినప్పుడు భారత్‌పై విమర్శలు రాహుల్ కు అలవాటేనన్న జైశంకర్ 
  • దేశ అంతర్గత విషయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రస్తావించడం దేశప్రయోజనం కాదని హితవు
  • రాహుల్ గాంధీ ఇటీవల అమెరికాలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన జైశంకర్

 విదేశాలకు వెళ్లిన సందర్భంలో భారత్‌పై విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి అలవాటేనని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ అంతర్గత విషయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రస్తావించడం దేశ ప్రయోజన హితం కాదన్నారు. అమెరికాలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను జైశంకర్ ప్రస్తావిస్తూ... ఆయన వ్యాఖ్యలను ప్రపంచం గమనిస్తోందన్నారు.

jaishankar
Rahul Gandhi
  • Loading...

More Telugu News