Varun Tej: రేపు వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం!

Varun Tej and Lavanya Tripathi set to get engage

  • గత కొంతకాలంగా వరుణ్ తేజ్, లావణ్యల గురించి కథనాలు
  • ఇరువురి మధ్య ప్రేమ అంటూ ప్రచారం
  • ఇప్పటివరకు ఖండించని వరుణ్, లావణ్య

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాలభామ లావణ్య త్రిపాఠిల పెళ్లి వార్తలు గత కొంతకాలంగా విపరీతంగా ప్రచారంలో ఉన్నాయి. ఊహాగానాలకు బలం చేకూరుస్తూ వరుణ్ తేజ్, లావణ్యల నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారైంది. రేపు (జూన్ 9) ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరగనుంది. 

అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ రవణం స్వామినాయుడు ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించారు. ఎన్నాళ్లుగానో వేచిన తరుణం వచ్చేసిందంటూ వరుణ్ తేజ్, లావణ్యలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. 

గత కొంతకాలంగా వరుణ్ తేజ్, లావణ్యల గురించి మీడియాలో కథనాలు, సోషల్ మీడియాలో పోస్టులు కనిపించడం కామన్ అయిపోయింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారన్నదే వాటన్నింటి సారాంశం. ఈ వార్తలు అటు లావణ్య త్రిపాఠి కానీ, ఇటు వరుణ్ తేజ్ కానీ ఖండించకపోవడంతో ప్రేమాయణం నిజమేనని కొంతమేర స్పష్టత వచ్చింది.

Varun Tej
Lavanya Tripathi
Engagement
Love
Wedding
  • Loading...

More Telugu News