Nayanatara: తన గ్లామర్ సీక్రెట్ చెప్పిన నయనతార!

Nayanatara Interview
  • తిరుగులేని హీరోయిన్ గా నయనతార 
  • సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటి 
  • తన ఆరోగ్య రహస్యం గురించిన విషయాల వెల్లడి 
  • త్వరలో రానున్న 'ఇరైవన్' సినిమా 
నయనతార కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి, ఇంతవరకూ వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు .. తమిళ ... మలయాళ భాషల్లో ఆమె స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుండటం విశేషం. సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా కూడా ఆమెకి పేరు ఉంది. సుదీర్ఘకాలంగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఆమె అదే గ్లామర్ తో కనిపిస్తుండటం ఆశ్చర్యం. 

తాజా ఇంటర్వ్యూలో నయనతారకి ఆమె గ్లామర్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె స్పందిస్తూ  .. " ప్రతి రోజూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తాను .. అలాగే క్రమం తప్పకుండా యోగా చేస్తాను. నేను ఏదైతే డైట్ ను ప్లాన్ చేసుకున్నానో, అదే డైట్ ను తీసుకుంటూ ఉంటాను. దాదాపు ఈ విషయంలో మార్పు రాకుండా చూసుకుంటాను. 

మంచినీళ్లు ఎక్కువగా తాగుతాను .. మంచినీళ్లను మించిన ఔషధం లేదనేది నా అభిప్రాయం. ఇక 8 గంటలపాటు నిద్రపోతాను. నేను ఫిట్ నెస్ తో .. గ్లామర్ గా కనిపించడానికి ఇదే కారణం" అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆమె తాజా చిత్రమైన 'ఇరైవన్' ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Nayanatara
Actress
Kollywood

More Telugu News