Mumbai: చార్జీ విషయంలో గొడవ.. ప్రయాణికుడిని లైంగికంగా వేధించిన ఆటో డ్రైవర్

  • ముంబైలోని ఘట్కోపర్ శివారులో ఘటన
  • తాగిన మత్తులో ప్రయాణికుడు
  • రూ. 250 అడిగితే రూ. 100 మాత్రమే ఇవ్వడంతో గొడవ
  • నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం
Auto Driver Sexuall Assault On Passenger

తాగిన మత్తులో ఉన్న ప్రయాణికుడితో చార్జీ విషయంలో గొడవ పడిన 25 ఏళ్ల ఆటో డ్రైవర్ ఆపై లైంగిక వేధింపులకు దిగాడు. ప్రస్తుతం ఆ డ్రైవర్ కటకటాలు లెక్కిస్తున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి ఘట్కోపర్ శివారులో జరిగిందీ ఘటన. 31 ఏళ్ల ప్రయాణికుడు ఆటో మాట్లాడుకున్నాడు. తాగిన మత్తులో ఎక్కడికి వెళ్లాలో స్పష్టత లేని ప్రయాణికుడు ఆటో డ్రైవర్‌ను పలు ప్రదేశాలు తిప్పించాడు. గంట తర్వాత ఆటో దిగిన ప్రయాణికుడితో రూ. 250 ఇవ్వాలని డ్రైవర్ డిమాండ్ చేశాడు. 

ప్రయాణికుడు వంద రూపాయలు మాత్రమే చేతిలో పెట్టడంతో గొడవ మొదలైంది. అది మరింత ముదరడంతో రెచ్చిపోయిన ఆటో డ్రైవర్.. ప్రయాణికుడిని సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. ఆ తర్వాత ప్రయాణికుడిని ఏటీఎంకు తీసుకెళ్లి రూ. 200 డ్రా చేయాలని బలవంతం చేశాడు. అక్కడ అతడి మొబైల్ ఫోన్, ఏటీఎం కార్డు తీసుకుని పరారయ్యాడు. మంగళవారం బాధిత ప్రయాణికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News