Hyderabad: హైదరాబాద్ లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లే అంటున్న తల్లిదండ్రులు!

Inter student committed suicide in Hyderabad

  • కుల్సుంపుర పీఎస్ పరిధిలో ఘటన
  • నిన్న రాత్రి 7.30 గంటలకు ఆత్మహత్య
  • కొందరు వ్యక్తులు ఇంటి ముందు నిమ్మకాయలు, దీపాలు పెడుతున్నారన్న తల్లిదండ్రులు

హైదరాబాద్ లో ఇంటర్ సెకండియర్ చదువుతున్న నవ్య అనే విద్యార్థిని ఆత్యహత్య చేసుకుంది. కుల్సుంపుర పరిధిలోని భరత్ నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్న రాత్రి 7.30 గంటలకు ఆమె బలవన్మరణానికి పాల్పడింది. మరోవైపు తమ కూతురుని క్షుద్రపూజలు చేసి చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు గత నాలుగు రోజులుగా క్షుద్రపూజలు చేసి నిమ్మకాయలు, దీపాలు పెట్టి వెళుతున్నారని తెలిపారు. క్షుద్రపూజల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నవ్య చదువు విషయంలో ఉత్తమ విద్యార్థిని. పదో తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మంచి మార్కులు సాధించింది. ఇంకోవైపు, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
Inter Student
Suicide
Black Magic
  • Loading...

More Telugu News