Amul Dairy: విజయ డెయిరీ స్టాల్స్ లో అమూల్ పాలు అమ్మితే తప్పేంటి?: మంత్రి వేణుగోపాలకృష్ణ

Minister Venugopalakrishna talks about Amul Dairy

  • ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం 
  • మీడియాకు వివరాలు తెలిపిన మంత్రి చెల్లుబోయిన
  • అమూల్ డెయిరీ అంశం ప్రస్తావన
  • అమూల్ కు సాగిలపడలేదని, స్వాగతించామని వెల్లడి
  • అమూల్ రాకతో పాడిరైతులకు మేలు జరిగిందని వివరణ

అమూల్ డెయిరీ అంశంపై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ కేబినెట్ సమావేశం వివరాలు వెల్లడించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నేడు పాల సేకరణ ధర పెరిగిందని, ఏపీకి అమూల్ రావడం వల్లే పాడి రైతులకు మేలు జరిగిందని అన్నారు. పోటీతత్వంతో ధర పెరగడంతో పాడిరైతులకు మంచి లాభం కలుగుతుందని అన్నారు. 

అమూల్ విషయంలో విపక్షాలు చేస్తున్న ప్రచారం సరికాదని హితవు పలికారు. అమూల్ కు రాష్ట్ర ప్రభుత్వమేమీ సాగిలపడలేదని, స్వాగతించిందని స్పష్టం చేశారు. పాడిరైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటే ఎందుకు విమర్శిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ డెయిరీ స్టాల్స్ లో అమూల్ పాలు అమ్మితే తప్పేంటి? అని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు.

Amul Dairy
Chelluboyina Venugopalakrishna
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News