Cricket: ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో.. నల్లటి రిబ్బన్లు ధరించి మైదానంలోకి దిగిన భారత్, ఆసిస్ ఆటగాళ్లు

Team India and Australia Players Are Wearing Black Armbands

  • ఒడిశా రైలు ప్రమాదంలో 270 మందికి పైగా మృతి
  • సంతాప సూచకంగా భుజానికి నల్ల రిబ్బన్లు ధరించిన ఆటగాళ్లు
  • అంతకుముందు మౌనం పాటించి నివాళులు

భారత్ - ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ బుధవారం ప్రారంభమైంది. ఇంగ్లాండ్ లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్, ఆసిస్ ఆటగాళ్లు జాతీయ గీతాలాపన సందర్భంగా భుజానికి నల్ల రిబ్బన్లు ధరించి మైదానంలో అడుగు పెట్టారు.

ఇటీవల ఒడిశాలో ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ తెలిసిందే. ఈ ఘటనలో 270 మందికి పైగా మృతి చెందగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ రైలు ప్రమాదం నేపథ్యంలో వారి మృతికి సంతాప సూచకంగా ఇరుజట్ల ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి మైదానంలో అడుగు పెట్టారు. మొదట కాసేపు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

Cricket
Australia
Team India
  • Loading...

More Telugu News