Suresh Gopi: ప్రముఖ సినీ నటుడు సురేశ్ గోపి కూతురిపై బాడీ షేమింగ్ కామెంట్లు

Body shaming comments on Suresh Gopi daughter

  • కెనడాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భాగ్య
  • లావుగా ఉన్న వాళ్లకు చీరలు సెట్ కావన్న నెటిజన్
  • మీ పనిపై దృష్టి పెడితే బాగుంటుందన్న భాగ్య

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు విమర్శలు చేయడం సర్వసాధారణమైపోయింది. తాజాగా ప్రముఖ మలయాళీ నటుడు సురేశ్ గోపి కూతురు భాగ్య బాడీ షేమింగ్ కు గురయ్యారు. తనను కామెంట్ చేసిన వ్యక్తికి భాగ్య కూడా సీరియస్ గా రిప్లై ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే కెనడాలోని ఒక కాలేజీ నుంచి భాగ్య గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ పిక్స్ పై ఒక నెటిజన్ స్పందిస్తూ... ఇకపై మీరు చీరలను పక్కన పెట్టి వెస్టర్న్ దుస్తులు వేసుకుంటే బాగుంటుందని కామెంట్ చేశాడు. లావుగా ఉన్నవాళ్లకు చీరలు పెద్దగా సెట్ కావని, వెస్టర్న్ దుస్తుల్లో మీరు అందంగా ఉంటారని సూచించాడు. 

ఈ వ్యాఖ్యలపై భాగ్య స్పందిస్తూ... మీ ఉచిత సలహాలకు ధన్యవాదాలు అని రిప్లై ఇచ్చింది. తన బరువు ఇతరుల సమస్య కాదని... కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఇతర భారతీయ విద్యార్థుల మాదిరి పాశ్చాత్య సంస్కృతికి బలవంతంగా తలవంచే వ్యక్తిని తాను కాదని చెప్పింది. ఇతరుల శరీరాకృతి గురించి వ్యాఖ్యలు చేయకుండా... మీ పనిపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికింది. మరోవైపు సురేశ్ గోపి తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి.

Suresh Gopi
Daughter
Body Shaming
  • Loading...

More Telugu News