tspsc: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు: ఛార్జిషీట్‌లో 37 మంది నిందితుల పేర్లు!

37 accused name in tspsc paper leak case

  • త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేయనున్న సిట్
  • న్యాయసలహా అనంతరం వచ్చే వారం ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం
  • టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఇప్పటి వరకు 50 మంది అరెస్ట్

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్... నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. ఇందులో 37 మంది నిందితుల పేర్లు చేర్చనున్నారు. న్యాయ సలహా అనంతరం ఛార్జిషీట్ ను వచ్చే వారం దాఖలు చేసే అవకాశం ఉంది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సిట్ ఇప్పటి వరకు 50 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో పదిహేను మంది బెయిల్‌పై బయటకు వచ్చారు.

కీలక నిందితులు ప్రవీణ్, రాజశేఖరరెడ్డితో పాటు పలువురు జైల్లో ఉన్నారు. అనుబంధ ఛార్జిషీట్ లో మిగతా నిందితుల పేర్లను చేర్చనున్నారు. ఇదిలా ఉండగా, డీఈ రమేశ్ అరెస్టుతో ఈ కేసులో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. రమేశ్ హైటెక్ కాపీయింగ్ చేయించడంతో పాటు 80 మందికి ఏఈ ప్రశ్నాపత్రాన్ని విక్రయించినట్లు దర్యాఫ్తులో వెల్లడైన విషయం తెలిసిందే.

tspsc
paper leak
sit
  • Loading...

More Telugu News