Team India: డబ్ల్యూటీసీ ఫైనల్: ఆసీస్ పై టాస్ గెలిచిన టీమిండియా

  • లండన్ ఓవల్ మైదానంలో టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్
  • భారత్ × ఆస్ట్రేలియా
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ
Team India won the toss and opt bowling

భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ సమరం లండన్ లోని ఓవల్ మైదానంలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ పై పచ్చిక ఉండడంతో బౌలర్లకు లాభిస్తుందని టీమిండియా సారథి రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నట్టు అర్థమవుతోంది. గత కొన్నాళ్లుగా టెస్టుల్లో నిలకడైన ఆటతీరు కనబరుస్తున్న భారత జట్టు... డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలపుతో ఈ సీజన్ ను విజయవంతంగా ముగించాలని భావిస్తోంది. అటు, ఆసీస్ జట్టు కూడా కీలక ఆటగాళ్లు ఫామ్ లో ఉండడంతో విజయంపై ధీమాగా ఉంది. 


టీమిండియా...
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్  భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మవ్ సిరాజ్.

ఆస్ట్రేలియా...
పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, స్కాట్ బోలాండ్.

More Telugu News