Pattabhi: ఉద్యోగుల ఇళ్లకు పోలీసులను పంపి బెదిరిస్తున్నారు: పట్టాభి

Jagan is cheating employees once again says Pattabhi

  • సీపీఎస్ రద్దుపై మంత్రుల కమిటీ హామీ ఇవ్వలేదన్న పట్టాభి
  • జీపీఎస్ నే అమలు చేయనున్నట్టు తెలిపిందని విమర్శ
  • ఉద్యోగులను జగన్ మరోసారి మోసం చేస్తున్నారని మండిపాటు

ప్రభుత్వ ఉద్యోగులపై వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. ఓవైపు ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చలు జరుపుతూనే... మరోవైపు ఉద్యోగుల ఇళ్లకు పోలీసులను పంపి బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నిన్న ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ నిర్వహించిన చర్చల్లో సీపీఎస్ రద్దుపై ఎలాంటి హామీ ఇవ్వలేదని విమర్శించారు. గతంలో ప్రకటించిన జీపీఎస్ నే అమలు చేయనున్నట్టు తెలిపిందని చెప్పారు. పీఆర్సీకి కమిటీ పేరుతో మరోసారి కాలయాపన చేసేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగులను ముఖ్యమంత్రి జగన్ మరోసారి మోసం చేస్తున్నారని అన్నారు.  

Pattabhi
Telugudesam
Govt Employees
Jagan
YSRCP
  • Loading...

More Telugu News