MS Dhoni: ధోనీ నుంచి కీలక సలహాలు తీసుకున్న కేఎస్ భరత్

KS Bharat took advices from MS Dhoni

  • రేపు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్స్
  • కీపర్ గా భరత్ కు తుది జట్టులో స్థానం దక్కే అవకాశం
  • ఇంగ్లండ్ పరిస్థితులు ఎలా ఉంటాయో ధోనీ చెప్పాడన్న భరత్

లండన్ లో రేపు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ సిరీస్ ఫైనల్స్ ప్రారంభం కాబోతోంది. రేపటి మ్యాచ్ లో వికెట్ కీపర్ స్థానం కోసం కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ మధ్య పోటీ నెలకొంది. అయితే తుది జట్టులో భరత్ కే చోటు దక్కే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు భరత్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. వికెట్ కీపింగ్ గురించి ధోనీ తనకు కొన్ని సలహాలు ఇచ్చాడని, ఇంగ్లండ్ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిపాడని వెల్లడించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఆయన కీపింగ్ అనుభవాల గురించి ధోనీ చెప్పాడని, ధోనీ నుంచి తాను ఎన్నో విషయాలను తెలుసుకున్నానని చెప్పాడు. 

ఇండియాలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో భరత్ నాలుగు మ్యాచ్ లు ఆడాడు. రిషభ్ పంత్ గాయపడటంతో భరత్ కు అవకాశం దక్కింది. కీపర్ గా భరత్ మంచి ప్రదర్శనను కనపరిచినప్పటికీ, బ్యాట్స్ మెన్ గా మాత్రం విఫలమయ్యాడు.

MS Dhoni
KS Bharat
Team India
WTC
  • Loading...

More Telugu News