heart disease: గుండెకు ఇవి పెద్ద శత్రువులు!

5 biggest and preventable risk factors of heart disease

  • అధిక రక్తపోటుతో అధిక ముప్పు
  • పొగతాగడం, మద్యపానం అలవాట్లతోనూ నష్టమే
  • చురుకైన జీవనశైలితో సానుకూల ఫలితాలు

కరోనరీ హార్ట్ డిసీజ్ అనేది గుండె పోటుకు ఎక్కువగా కారణమవుతుంది. నిజానికి గుండె జబ్బులకు కారణం అయ్యే వాటి నియంత్రణ మన చేతుల్లోనే ఉంటుంది. చాలా మంది దీనిపై శ్రద్ధ లేక గుండె జబ్బులు పెరిగిపోయేలా చేసుకుంటారు. ఎక్కువ మందిలో గుండె జబ్బులకు కారణమవుతున్న ఐదు రిస్క్ అంశాలను పరిశీలించినట్టయితే..

అధిక రక్తపోటు
గుండె జబ్బులకు అధిక రక్తపోటు అతిపెద్ద ముప్పు కాగలదు. హార్ట్ ఎటాక్ బాధితులకు చికిత్స చేసే వైద్యులు చెప్పేది ఇదే. ధమనుల ద్వారా రక్తం ప్రవహించే సమయంలో పడే ఒత్తిడే రక్తపోటు. అధిక రక్తపోటు ఉంటే అది గుండె పైనే కాదు, మూత్రపిండాలు, మెదడు, ఇతర అవయాలపైనా చూపుతుంది. వైద్యులు సూచించిన ఔషధాలు తీసుకుంటూ, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా రక్తపోటును అదుపులో పెట్టుకోవచ్చు.

ఆహారం
అనారోగ్యానికి దారితీసే ఆహారానికి దూరంగా ఉండాలి. అధిక చక్కెరలు, సోడియం కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. ధమనుల గోడల్లో కొలెస్ట్రాల్ చేరిపోతుంది. రక్తనాళాల గోడలు కుచించుకుపోతాయి. దీంతో రక్త ప్రవాహం సాఫీగా సాగదు. ఫలితంగా హార్ట్ ఎటాక్ రిస్క్ పెరుగుతుంది.

మద్యపానం
రోజులో మూడు కంటే ఎక్కువ డ్రింక్ లు (ఆల్కహాల్/5 శాతం ఆల్కహాల్) తాగడం వల్ల కూడా హాని జరుగుతుంది. రక్తపోటు పెరుగుతుంది. దీనివల్ల గుండెపై ముప్పు పెరిగిపోతుంది. గుండె కండరాలపై ఒత్తిడి పడి గుండె జబ్బులకు కారణమవుతుంది.

చలనం లేని జీవనం
జీవనశైలి నిశ్చలంగా ఉండకూడదు. చురుగ్గా ఉండాలి. ఎలాంటి అనారోగ్యం లేకపోయినా సరే, శారీరక వ్యాయామం లోపించడం వల్ల గుండె జబ్బులకు దారితీస్తుంది. అధిక రక్తపోటు, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్ సమస్యలు పలకరిస్తాయి.

పొగతాగడం
గుండెకు పొగతాడం కూడా ముప్పు తెచ్చి పెడుతుంది. సిగరెట్ లోని రసాయనాలు రక్తం మందమయ్యేలా చేస్తాయి. దీంతో క్లాట్స్ ఏర్పడతాయి. దీనివల్ల రక్త సరఫరా తగ్గుతుంది. దీంతో గుండె జబ్బుల రిస్క్ పెరిగిపోతుంది.

heart disease
risk factors
preventable
health
  • Loading...

More Telugu News