Bandi Sanjay: కేంద్రం ఉచితంగా బియ్యం పంపినా వాటిని పేదలకు పంపిణీ చేయడం లేదు: బండి సంజయ్

Bandi Sanjay on Ration Dealers demands
  • రేషన్ డీలర్ల డిమాండ్లను పరిష్కరించడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శ
  • ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రేషన్ డీలర్లు సమ్మె చేస్తున్నారని వ్యాఖ్య
  • రేషన్ కమీషన్ ను ప్రభుత్వం సొంతానికి వాడుకుంటోందని ఆరోపణ
కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపించినప్పటికీ వాటిని పేదలకు సక్రమంగా పంపిణీ చేయడం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రేషన్ డీలర్ల డిమాండ్లను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వారు సమ్మె చేసే పరిస్థితి వచ్చిందన్నారు. 

రేషన్ కు సంబంధించి సకాలంలో కమీషన్ చెల్లిస్తున్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం దానిని సొంతానికి వాడుకుంటోందని ఆరోపించారు. డీలర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు.
Bandi Sanjay
KCR

More Telugu News