mumbai: డీజేకి డబ్బులు ఇవ్వలేదని బర్త్ డే రోజే స్నేహితుడిని చంపేశారు!

  • రూ.10 వేలు ఖర్చు చేసి స్నేహితులకు పార్టీ ఇచ్చిన సాబిర్ అన్సారీ
  • కిరాయికి తెచ్చిన డీజేకి డబ్బులు ఇవ్వాలన్న ఫ్రెండ్స్
  • ఉన్నవన్నీ అయిపోయాయని చెప్పిన సాబిర్.. 
  • గొడవకు దిగిన స్నేహితులు.. తీవ్రంగా దాడి, కత్తిపోట్లు
  • ముంబయి గోవండిలోని బైగ‌న్‌వాడి ఏరియాలో ఘటన
mumbai birthday boy murdered by friends for not paying dj four arrested

ముంబయిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డీజేకి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో బర్త్ డే బాయ్ ని స్నేహితులే చంపేశారు. వాగ్వాదం కాస్తా గొడవగా మారి.. స్నేహితుడిపై తీవ్రంగా దాడి చేశారు. తర్వాత క‌త్తితో అత‌ని ఛాతిలో పొడిచి దారుణంగా హత్య చేశారు.

ముంబయి గోవండిలోని బైగ‌న్‌వాడి ఏరియాలో సాబిర్ అన్సారీ అనే 22 ఏళ్ల కుర్రాడు త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా దాబాలో ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చాడు. రూ.10 వేల దాకా ఖ‌ర్చు చేశాడు. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. అయితే డీజే విషయంలో గొడవ తలెత్తింది. నలుగురూ కలిసి తీవ్రంగా దాడి చేసి కత్తులతో పొడిచారు. రక్తపు మడుగులో పడి ఉన్న సాబిర్ ను శతాబ్ది మున్సిపల్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. 

‘‘సాబిర్ స్నేహితుడు ఒక‌రు పార్టీ కోసం డీజే కిరాయికి తీసుకున్నాడు. డీజే కోసం అయిన ఖర్చును ఇవ్వాలని వాళ్లు అడిగారు. కానీ త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు లేక‌పోవ‌డంతో సాబిర్ ఇవ్వ‌లేదు. దీంతో అతడిని స్నేహితులే చంపేశారు’’ అని బాధితుడి తండ్రి పోలీసుల‌కు తెలిపాడు. ఈ కేసులో నిందితులపైన షారూక్‌, నిషార్‌.. గుజరాత్ లోని అహ్మదాబాద్‌కు పారిపోయారు. పోలీసులు వారిని అక్కడే అరెస్టు చేశారు. మ‌రో ఇద్ద‌రు మైన‌ర్ల‌ను జువెనైల్ హోమ్‌కు తరలించారు. శివాజీన‌గ‌ర్ పోలీసులు ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News