Rajasthan: పెళ్లి చేసుకుంటా, ఓ అమ్మాయిని వెతికిపెట్టండి.. అధికారులకు రాజస్థానీ లేఖ

Rajasthan man letter to government official tweet goes viral

  • తననో ఇంటి వాడిని చేయాలంటూ వేడుకోలు
  • ఫలానా లక్షణాలు ఉండాల్సిందేనని షరతు
  • సీఎం సహాయక శిబిరానికి చేరిన లెటర్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన లేఖ ఫొటో

ప్రభుత్వ అధికారులను సాయం కోరుతూ జనం లేఖలు రాయడం మామూలే.. కానీ ఓ వ్యక్తి నుంచి వచ్చిన లేఖను అందుకున్న అధికారులు ఆశ్చర్యపోయారు. ఆయనకు ఎలా సాయం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అంతగా ఆ లేఖలో ఏం రాశాడని అనుకుంటున్నారా.. తనకో పెళ్లి కూతురు కావాలని ఆ యువకుడు లేఖలో కోరాడట. ఇంట్లో సమస్యల వల్ల నలభై ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోలేదని, తనను ఓ ఇంటివాడిని చేసి పుణ్యం కట్టుకోవాలని అభ్యర్థిస్తున్నాడు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ లేఖ దుబ్బి గంగద్వాడి నుంచి వచ్చింది. ప్రస్తుతం ఈ లేఖకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాజస్థాన్ ముఖ్యమంత్రి సహాయక శిబిరానికి ఇటీవల మహావీర్ అనే వ్యక్తి లేఖ రాశాడు. తనకు 40 ఏళ్లని, ఇంకా పెళ్లి కాలేదని అందులో పేర్కొన్నాడు. తనకో అమ్మాయిని వెతికిపెడితే పెళ్లి చేసుకుని స్థిరపడతానని కోరాడు. అంతేకాదు, తనకు భార్యగా రాబోయే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలనూ మహావీర్ అందులో పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా తన ఇంటికి ఒక ఇల్లాలిని అందించాలని వినతి చేశాడు.

కాబోయే భార్యలో ఉండాల్సిన లక్షణాలు ఇవేనట..
* అమ్మాయి తప్పనిసరిగా సన్నగా ఉండాలి. 
* నాయకత్వ లక్షణాలు ఉండాలి. 
* న్యాయంగా వ్యవహరించడంతో పాటు అమ్మాయి వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

Rajasthan
Letter
marriage
request letter
govt officials
  • Loading...

More Telugu News