Prashanth: కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన 'అనంత' .. ట్రైలర్ రిలీజ్!

Anantha movie trailer released

  • ఇంట్రెస్టింగ్ పాయింటును టచ్ చేసిన 'అనంత'
  • దర్శకుడిగా మధుబాబు తోకల పరిచయం 
  • ఆసక్తిని పెంచుతున్న ట్రైలర్ 
  • ఈ నెల 9వ తేదీన విడుదలవుతున్న సినిమా 

ఇటీవల కాలంలో కొత్త కాన్సెప్ట్ లతో చిన్న సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ కంటెంట్ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే, ఆ సినిమాలు మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. అలా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఓ సినిమా రానుంది .. ఆ సినిమా పేరే 'అనంత'. పెద్దగా అప్ డేట్స్ లేకుండానే ఈ సినిమా రిలీజ్ కి వచ్చేస్తోంది.

ప్రశాంత్ నిర్మించిన ఈ సినిమాకి మధుబాబు దర్శకత్వం వహించాడు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా తాజాగా ప్రకటించారు. రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూనే ఒక ట్రైలర్ ను వదిలారు. ఈ సినిమా కంటెంట్ ఏమిటనేది ట్రైలర్ ద్వారా చెప్పడానికి ట్రై చేశారు. కొత్త పాయింట్ ను టచ్ చేసినట్టుగా మాత్రం తెలుస్తోంది. 

అయితే ట్రైలర్ ను షార్ప్ గా కట్ చేయకుండా .. ఒక చర్చ నడుస్తున్నట్టుగా చూపించారు. కాలం .. వయసు .. ఆయుష్షు .. ఎక్కువ కాలం బ్రతకడానికి ఏం చేయాలి? అనే అంశంపై ఈ చర్చ నడిచింది. ప్రశాంత్ కార్తీ .. అవినాశ్ కురువిల్ల .. రితిక .. విశ్వనాథ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, ఘంటసాల విశ్వనాథ్ సంగీతాన్ని అందించాడు.

Prashanth
Avinash Kuruvilla
Rithika
Anantha Movie
  • Loading...

More Telugu News