Gauhati: కుక్క మాంసం అమ్మకాలపై నిషేధాన్ని కొట్టివేసిన గౌహతి హైకోర్ట్

Gauhati high court quashes Nagaland government ban on sale of dog meat
  • జంతువుల నిర్వచనంలో శునకాలను పేర్కొనలేదని స్పష్టీకరణ
  • వర్తకులు వీటి ద్వారా ఆదాయం పొందుతున్నట్టు వ్యాఖ్య
  • రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తోసిపుచ్చిన ధర్మాసనం
కుక్క మాంసం ఎగుమతులు, విక్రయాలపై నిషేధం విధిస్తూ నాగాలాండ్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని గౌహతి హైకోర్టుకు చెందిన కోహిమా బెంచ్ కొట్టి వేసింది. వాణిజ్య అవసరాల కోసం కుక్కల దిగుమతి, వాటితో వర్తకం, రెస్టారెంట్లలో వాణిజ్య ప్రాతిపదిక, వాటి మాంసం విక్రయాలను నిషేధిస్తూ నాగాలాండ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నిషేధ ఉత్తర్వులు జారీ చేయడానికి చీఫ్ సెక్రటరీ తగిన వ్యక్తి కాదని హైకోర్టు పేర్కొంది. 

నిజానికి ఈ నిషేధాన్ని 2020 నవంబర్ లోనే సింగిల్ బెంచ్ ధర్మాసనం తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై ఇప్పుడు హైకోర్టు కోహిమా బెంచ్ జస్టిస్ మర్లి వంకున్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. కోహిమా మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో శునకాలతో వ్యాపారం నిర్వహించే లైసెన్స్ డ్ వర్తకులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేశారు. ఆహార భద్రత చట్టాన్ని తప్పుగా అన్వయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఆరోపించారు. జంతువులు అనే నిర్వచనం కింద శునకాలను పేర్కొనని విషయాన్ని జడ్జి లేవనెత్తారు. శునకాల వర్తకంతో పిటిషనర్లు ఆదాయం ఆర్జిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ వారికి అనుకూలంగా ఆదేశాలు జారీ చేశారు.
Gauhati
high court
Nagaland government
dog meat
ban
quashed

More Telugu News