Ashika Ranganath: ఈ 6 నెలల్లో ఫస్టు మూవీతో హిట్ కొట్టలేకపోయిన బ్యూటీలు వీరే!

Tollywood New heroines update

  • టాలీవుడ్ పట్ల మొగ్గు చూపుతున్న బ్యూటీలు 
  • 6 నెలల్లో అడుగుపెట్టిన ముద్దుగుమ్మలు 
  • కొత్త భామలకు ఆదిలోనే ఎదురైన నిరాశ
  • ఆరుగురిలో గ్లామర్ పరంగా మార్కులు కొట్టేసిన ఆషిక రంగనాథ్  

టాలీవుడ్ కి ఎప్పటి మాదిరిగానే ఈ 6 నెలల్లో చాలామంది కథానాయికలు పరిచయమయ్యారు. మరీ చిన్న సినిమాల ద్వారా పరిచయమైనవారి సంగతి అలా ఉంచితే, కాస్త క్రేజ్ ఉన్న హీరోల సరసన .. పెద్ద బ్యానర్లలో వచ్చిన సినిమాల జాబితాను తీసుకుంటే, ఆ సినిమాల ద్వారా పరిచయమైన ఓ అరడజను మంది కథానాయికలు కనిపిస్తారు.'బుట్టబొమ్మ' సినిమా ద్వారా అనిక సురేంద్రన్ తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచయమైంది. నాయిక ప్రధానమైన ఈ సినిమా, కథాకథనాల పరంగా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది. ఇక 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమాతో గౌరీ కిషన్ ఎంట్రీ ఇచ్చింది. సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ సినిమా, కంటెంట్ పరంగా ప్రేక్షకులను ఎంతమాత్రం మెప్పించలేకపోయింది. 'మీటర్' సినిమాతో టాలీవుడ్ లోకి అతుల్య రవి అడుగుపెట్టింది. ఆమె కెరియర్ కి ఈ సినిమా ఎంతమాత్రం హెల్ప్ కాలేకపోయింది. ఇక 'అమిగోస్' సినిమాతో గ్లామరస్ బ్యూటీగా ఆషిక రంగనాథ్ మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడం ఆమెను పూర్తిగా నిరాశపరిచింది. అఖిల్ జోడీగా 'ఏజెంట్' సినిమాతో సాక్షి వైద్య పలకరించింది. ఆమె పాత్రకి అంతగా ప్రాధాన్యత లేకపోవడం .. కంటెంట్ జనాలకు ఎక్కకపోవడం దెబ్బకొట్టేసింది. రీసెంట్ గా వచ్చిన 'నేను స్టూడెంట్ సర్' సినిమాతో అవంతిక దాసాని ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫలితం నిరాశపరిచింది. ఇలా ఈ 6 నెలల్లో పరిచయమైన అందగత్తెలలో ఎవరికీ కూడా హిట్ పడకపోవడం దురదృష్టం.

Ashika Ranganath
Sakshi Vaidya
Avanthika
Athulya Ravi
Anika
Gowry Kishan
  • Loading...

More Telugu News