Hema Malini: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై హేమమాలిని ఏం చెప్పారంటే..!

I contest from Mathura only says Hema Malini

  • మథుర లోక్ సభ స్థానం నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన హేమమాలిని
  • వచ్చే ఎన్నికల్లో కూడా మథుర నుంచే పోటీ చేస్తానని వ్యాఖ్య
  • మోదీ మూడో సారి ప్రధాని అవుతారని ధీమా

ప్రముఖ సీనియర్ సినీ నటి హేమమాలిని రాజకీయాల్లో చురుకుగా ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీగా ఆమె ఉన్నారు. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల గురించి, తాను పోటీ చేసే స్థానం గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా తాను మథుర (ఉత్తరప్రదేశ్) నుంచే పోటీ చేస్తానని ఆమె తెలిపారు. ఇతర స్థానం నుంచి పోటీ చేయాలనే ప్రపోజల్ వస్తే, అది అంగీకారం కాదని స్పష్టం చేశారు. 

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలను చేపడతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. హేమమాలిని మథుర లోక్ సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు (2014, 2019) గెలుపొందారు. అంతకు ముందు ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ఈసారి కూడా మథుర నుంచే పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు.

Hema Malini
BJP
Lok Sabha
Elections
  • Loading...

More Telugu News