Nawazuddin Siddiqui: నాకు సంతోషంగా ఉండే హక్కు లేదా?: కొత్త వ్యక్తితో ఉన్న ఫొటోను షేర్ చేసిన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ భార్య

Nawazuddin wife posts pic with mystery man

  • భార్యతో నవాజుద్దీన్ కు విభేదాలు
  • కొత్త వ్యక్తితో రిలేషన్ లో నవాజ్ భార్య అలియా
  • కొత్త జీవితంలో సంతోషంగా ఉన్నానని వ్యాఖ్య

బాలీవుడ్ లో ఉన్న ట్యాలెంటెడ్ యాక్టర్స్ లో నవాజుద్దీన్ సిద్ధికీ ఒకరు. అయితే, భార్య అలియాతో మాత్రం ఆయనకు వివాదం కొనసాగుతోంది. తనను, తన పిల్లల్ని నవాజ్ రోడ్డుపై వదిలేశాడంటూ ఇటీవల ఆమె రచ్చ చేసింది. తన పిల్లలను ఇంట్లోకి రానివ్వాలంటూ డిమాండ్ చేసింది. ఆయనపై కేసు కూడా పెట్టింది. ఈ క్రమంలో ఆమె తాజాగా అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. మరో వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు, తనకు సంతోషంగా ఉండే హక్కు లేదా? అని ప్రశ్నించింది. 

తాను ఎంతో నమ్మిన బంధం నుంచి బయటకు రావడానికి 19 ఏళ్లకు పైగా పట్టిందని అలియా తెలిపింది. తన జీవితంలో తన పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యత అని చెప్పింది. తన పిల్లలు ఇప్పటి వరకు తనతోనే ఉన్నారని, ఇకపై కూడా తనతోనే ఉంటారని తెలిపింది. అయితే, స్నేహానికన్నా కొన్ని సంబంధాలు ఎక్కువని చెప్పింది. ప్రస్తుతం తన కొత్త రిలేషన్ షిప్ కూడా ఇటువంటిదేనని, కొత్త జీవితంలో సంతోషంగా ఉన్నానని తెలిపింది. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

Nawazuddin Siddiqui
Bollywood
Wife
New Man
Relation
  • Loading...

More Telugu News