Prabhas: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్.. పట్టు వస్త్రాలతో సత్కరించిన ఆలయ అధికారులు

  • తిరుపతిలో నేడు ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
  • వేకువజామున స్వామివారిని దర్శించుకున్న ప్రభాస్
  • సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడిన జనం
Tollywood Actor Prabhas Visits Tirumala Lord Venkanna

తిరుపతిలో నేడు ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. 

అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. ప్రభాస్‌ను ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తమ అభిమాన నటుడిని చూసిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.

More Telugu News