Karnataka: కర్ణాటకలో ఆగివున్న లారీని ఢీకొట్టిన జీపు.. ఐదుగురు ఏపీవాసుల దుర్మరణం

  • కలబురిగిలో దర్గా ఉర్సుకు వెళ్లి వస్తుండగా ఘటన
  • బాధితులను నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన వారిగా గుర్తింపు
  • మరో 13 మందికి గాయాలు
5 dead including two children in Karnataka road accident

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.  బాధితులు కలబురిగిలోని దర్గా ఉర్సుకు వెళ్లి వస్తుండగా యాదగిరి జిల్లాలో దుర్ఘటన చోటుచేసుకుంది. అదుపు తప్పిన జీపు రోడ్డు పక్కన ఆగివున్న లారీని బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో మునీర్ (40), నయామత్ (40), రమీజా బేగం (50), ముద్దత్ షీర్ (12), సుమ్మి (13) మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద విషయం తెలిసి వెలుగోడులో విషాద ఛాయలు అలముకున్నాయి.

More Telugu News