Virat Kohli: ఆసీస్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

Kohli On Tough Australia Challenge In World Test Championship Final

  • రెండ్రోజుల్లో ఆసీస్, భారత్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్
  • గతంలో ఆసీస్, భారత్ మధ్య పోటీ తీవ్రంగా ఉండేదన్న కోహ్లీ
  • రెండు సిరీస్ లు గెలిచిన తర్వాత పోటీ కాస్త గౌరవంగా మారిందని వ్యాఖ్య

మరో రెండ్రోజుల్లో ఆసీస్, భారత్ మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ మాట్లాడుతూ, గతంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉండేదని, ఘర్షణ వాతావరణం కనిపించేదన్నారు. కానీ తాము ఆస్ట్రేలియాలో రెండు సిరీస్ లు గెలిచిన తర్వాత ఆ పోటీ కాస్త గౌరవంగా మారిందని, ఓ టెస్ట్ టీమ్ గా తమని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదన్నారు. తమపై ప్రత్యర్థులకు ఉన్న గౌరవాన్ని చూశామని, వారి సొంతగడ్డపై కూడా గట్టి పోటీ ఇస్తామని వాళ్లు గుర్తించారన్నారు. టీమిండియాను వారు తేలిగ్గా తీసుకోవడం లేదన్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లండన్ లోని ఓవల్ గ్రౌండ్స్ లో జరగనుంది.

Virat Kohli
Australia
India
  • Loading...

More Telugu News