Harish Rao: సిద్ధిపేట ముద్దుబిడ్డ... ఇండియన్ ఐడల్ రన్నరప్ లాస్యప్రియపై హరీశ్ రావు ప్రశంసలు

Harish Rao appreciates Indian Idol runner up Lasya Priya

  • ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం
  • విజేతగా నిలిచిన సౌజన్య
  • రెండో స్థానంలో సిద్ధిపేట అమ్మాయి లాస్యప్రియ
  • హృదయపూర్వక అభినందనలు అంటూ హరీశ్ రావు ట్వీట్

ఆహా ఓటీటీలో నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్-2023 కార్యక్రమం ముగిసింది. ఈ సీజన్-2 పోటీల్లో సౌజన్య విజేత కాగా, లాస్యప్రియ రన్నరప్ గా నిలిచింది. లాస్యప్రియ సిద్ధిపేట అమ్మాయి. దాంతో, మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. 

సిద్ధిపేట ముద్దుబిడ్డ అంటూ లాస్యప్రియపై ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో రన్నరప్ గా నిలిచిన లాస్యప్రియకు హృదయపూర్వక అభినందనలు అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు. మున్ముందు లాస్యప్రియ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 

తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికీ గొప్ప భవిష్యత్ ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.

Harish Rao
Lasya Priya
Indian Idol
Runner Up
Siddipet
Aha OTT
  • Loading...

More Telugu News