vinod kumar: రైల్వే శాఖలో ఖాళీగా వున్న లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయండి: కేంద్రమంత్రికి టీఎస్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ లేఖ

BRS vinod Kumar letter to Union Miniser

  • రైల్వే శాఖలో 3.12 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని లేఖలో విజ్ఞప్తి
  • దక్షిణ మధ్య రైల్వేలోనే 30 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని వెల్లడి
  • ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతోందన్న వినోద్

రైల్వే శాఖలో మూడు లక్షలకు పైగా ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లేఖ రాశారు. రైల్వేలో 3.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. 

ఇందులో దక్షిణ మధ్య రైల్వేలోనే 30 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం వల్ల ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పర్యవేక్షణ లోపానికి దారి తీసి, ప్రమాదాలకు కారణంగా మారుతోందన్నారు. కాబట్టి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు.

vinod kumar
Indian Railways
  • Loading...

More Telugu News