vanga geetha: ఆస్తులు రాయించుకున్నారని వంగా గీతపై వదిన ఫిర్యాదు

Relative complaints against MP Vanga Geetha

  • స్పందన కార్యక్రమంలో గీతతో పాటు కుసుమకుమారి దంపతులపై ఫిర్యాదు
  • బలవంతంగా ఆస్తులు రాసుకున్నారని కలెక్టర్ కు తెలిపిన వదిన కళావతి
  • 2010లో వంగా గీత సోదరుడు, కళావతి భర్త అయిన కృష్ణకుమార్ మృతి

కాకినాడ లోక్ సభ సభ్యురాలు, వైసీపీ నేత వంగా గీతపై ఆమె వదిన ఫిర్యాదు చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఆమె వదిన కళావతి ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2006లో తన భర్త కృష్ణకుమార్ తో తమ ఆస్తులను వారు బలవంతంగా రాయించుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పిల్లలు కోర్టులో పోరాడుతుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని కలెక్టర్ కు తెలిపారు. కృష్ణ కుమార్ వంగా గీత సోదరుడు. అతను 2010లో మృతి చెందాడు. ఇప్పుడు వంగా గీతతో పాటు ఆమె సోదరి కుసుమకుమారి దంపతులపై కూడా కళావతి ఫిర్యాదు చేశారు.

vanga geetha
YSRCP
  • Loading...

More Telugu News