Prakasam District: ఒంగోలులో తుపాకితో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ బలవన్మరణం

AR Constable commits suicide in Prakasam

  • కోర్టు సెంటర్ సమీపంలో ఆంధ్రా బ్యాంకు వద్ద కాపలాదారుగా ఉన్న కానిస్టేబుల్
  • మధ్యాహ్నం తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య
  • పోలీసులకు సమాచారం ఇచ్చిన బ్యాంకు అధికారులు

ప్రకాశం జిల్లా ఒంగోలులో వెంకటేశ్వర్లు అనే ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోర్టు సెంటర్ సమీపంలో ఆంధ్రా బ్యాంకు వద్ద కాపలాగా ఉన్న అతను ఈ రోజు మధ్యాహ్నం తన వద్ద ఉన్న తుపాకితో కాల్చుకొని, ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతనిని గమనించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న ఏఆర్ కానిస్టేబుల్ ను చీమకుర్తికి చెందినవాడిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Prakasam District
constable
  • Loading...

More Telugu News