actor: నేను ఒక్కడినే ఎందుకు మాట్లాడాలి.. నేనేమీ సూపర్ హీరో కాదు: సిద్ధార్థ్

Siddharth says about quitting Twitter I spoke up against issues but had no other actors for company

  • సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండడంపై సిద్ధూ స్పందన
  • తాను ఎప్పుడూ నిజాలనే మాట్లాడుతుండేవాడినని వ్యాఖ్య 
  • దుష్ట శక్తులపై తాను ఒక్కడినే పోరాడలేనంటూ వెల్లడి  

టక్కర్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నటుడు సిద్ధార్థ్, చిత్రం ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. 2022 ఆరంభంలో సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్ ను ఉపయోగించొద్దంటూ నిర్ణయం తీసుకుని, దూరంగా ఉండడంపై అతడికి ప్రశ్న ఎదురైంది. దీనికి కారణాలను సిద్ధార్థ్ వివరించాడు.

‘‘నేను ఎప్పుడూ వాస్తవాలనే మాట్లాడతాను. ఒక నటుడిగా నేను ఇన్నేళ్లుగా అదే చేస్తున్నాను. కానీ, నాకు తోడుగా ఎవరూ లేరు. ఎందుకు మాట్లాడడం లేదని వారిని ఎవరూ ఎప్పుడూ ప్రశ్నించలేదు. నేను ఒక్కడినే మాట్లాడుతున్నాను. మరి నేను ఒక్కడినే ఎందుకు మాట్లాడాలి? ప్రపంచంలో దుష్ట శక్తులు/దురాచారాలకు వ్యతిరేకంగా నేను ఒక్కడినే ఉద్యమించలేను. నేనేమీ సూపర్ హీరో కాదు. సంఘీభావంగా నిలబడినా, ఇబ్బందులు ఎదుర్కొన్నా నా వరకే ఉంటోంది. నాపై కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే నిర్మాతలు ఉన్నారు. కనుక నేను వారికే ప్రాధాన్యం ఇవ్వాలి’’ అన్నాడు సిద్ధార్థ్.

actor
quitting Twitter
Siddharth
  • Loading...

More Telugu News