road network: రోడ్డు నెట్ వర్క్ లో చైనాను దాటేసిన భారత్

Largest road networks in the world India beats China to take the second spot

  • భారత్ లో 63,72,613 కిలోమీటర్ల పొడవునా రహదారులు
  • అమెరికాలో అత్యధికంగా  68,03,479 కిలోమీటర్ల పొడవునా రహదారులు 
  • మూడో స్థానంలో చైనా.. 51.98 లక్షల కిలోమీటర్ల నిడివి

రహదారి నిడివి (నెట్ వర్క్) విషయంలో చైనాను భారత్ వెనక్కి నెట్టేసింది. 63,72,613 కిలోమీటర్ల పొడవునా రహదారులతో (అన్ని రకాల రహదారులు) భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. రహదారుల విషయంలో అన్ని దేశాల కంటే అమెరికా ముందుంది. ఆ దేశంలో 68,03,479 కిలోమీటర్ల పొడవైన రహదారులు ఉన్నాయి. ఈ రెండింటి తర్వాత చైనా మూడో స్థానంలో ఉంది. ఆ దేశంలో 51,98,000 కిలోమీటర్ల పొడవునా రహదారి వసతులు ఉన్నాయి. 

బ్రెజిల్ లో 20,00,000 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నాయి. రష్యా ఐదో స్థానంలో ఉంది. ఆ దేశంలో రహదారుల నిడివి 15,29,373 కిలోమీటర్ల పొడువునా విస్తరించింది. 10,53,215 కిలోమీటర్ల పొడవైన రహదారులతో ఫ్రాన్స్ ఆరో స్థానంలో ఉంది. కెనడా ఈ విషయంలో ఏడో స్థానంలో ఉంది. ఈ దేశంలో 10,42,300 కిలోమీటర్ల పొడవునా రహదారులు విస్తరించి ఉన్నాయి. ఆస్ట్రేలియాలో 8,73,573 కిలోమీటర్లు, మెక్సికో 8,17,596 కిలోమీటర్లు, దక్షిణాఫ్రికా 7,50,000 కిలోమీటర్ల రహదారులతో కలిగి టాప్-10లో ఉన్నాయి.

road network
largest
India
us
china
  • Loading...

More Telugu News