Odisha: ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్

Another rail accident in Odisha

  • డుంగురి నుంచి బార్ఘాడ్‌కు లైమ్‌స్టోన్‌తో వెళ్తున్న గూడ్స్
  • మెందపల్లి సమీపంలో పట్టాలు తప్పిన రైలు
  • దర్యాప్తు ప్రారంభించిన రైల్వే పోలీసులు

ఒడిశాలోని బాలసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం నుంచి దేశం ఇంకా పూర్తిగా కోలుకోకముందే ఒడిశాలోనే మరో రైలు ప్రమాదం జరిగింది. బార్ఘడ్ జిల్లాలో ఈ ఉదయం ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. లైమ్‌స్టోన్‌ను మోసుకెళ్తున్న రైలు డుంగురి నుంచి బార్ఘాడ్ వెళ్తుండగా మెందపల్లి సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో పలు వేగన్లు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. 

కాగా, బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో  275 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఒడిశా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు 108 మృతదేహాలను గుర్తించి వాటిని కుటుంబ సభ్యులకు అందించినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన 167 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనలో మరో 1,175 మంది గాయపడ్డారు.

Odisha
Balasore Train Accident
Bargarh
Goods Train
  • Loading...

More Telugu News