AHA: తెలుగు ఇండియన్ ఐడల్ 2 విన్నర్‌‌గా సౌజన్య

Soujanya Bhagvatula wins Telugu Indian Idol 2

  • ట్రోఫీ, రూ. 10 లక్షల బహుమతి అందించిన అల్లు అర్జున్
  • తొలి రన్నరప్ గా జయరాజ్, రెండో రన్నరప్ గా లాస్య
  • ఫైనల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన బన్నీ

తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ వేదికగా ప్రసారమైన ‘తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్-2‌’కు తెర‌ప‌డింది. సీజన్-2 గ్రాండ్ గా ముగిసింది. ఉత్కంఠ భ‌రితంగా సాగిన‌ ఈ ఫినాలే ఎపిసోడ్‌లో జయరామ్, సౌజన్య భాగవతుల, లాస్య ప్రియ, కార్తికేయ, శ్రుతి నండురి పోటీపడ్డారు. తమ గాత్రంతో అందరినీ మంత్ర ముగ్దులను చేశారు. చివరకు వీరిలో సౌజన్య విజేత‌గా నిలిచింది. అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంది. విన్నర్ గా సౌజన్య రూ.10 ల‌క్షల నగదు బహుమతి కూడా కైవసం చేసుకుంది. మొద‌టి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన జయరాజ్ కు 3 ల‌క్ష‌లు, రెండ‌వ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన లాస్యకు 2 ల‌క్ష‌ల చెక్ బన్నీ అందజేశారు. 

హేమచంద్ర హోస్ట్ గా చేసిన ఈ రియాలిటీ షోకు సంగీత దర్శకుడు థమన్, సింగర్ కార్తిక్, గీతామాధురిలు జ‌డ్జ్‌లుగా వ్యవహ‌రించారు. ఫినాలే ఎపిసోడ్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ దీన్ని మరింత స్పెషల్ గా మార్చారు. ఎంతో ప్ర‌తిభావంతులైన కంటెస్టెంట్స్ ప్ర‌ద‌ర్శ‌న చూసి తన మ‌న‌సంతా ఆనందంతో నిండిపోయిందన్నారు. ముఖ్యంగా సౌజ‌న్యను ప్రత్యేకంగా అభినందించారు. రెండేళ్ల చిన్నారికి త‌ల్లిగా ఉంటూనే ఓ వైపు సంగీతం, మ‌రో వైపు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవ‌టం అనేది అంత సులువైన విష‌యం కాదన్నారు.. సౌజ‌న్య సాధించిన ఈ విజ‌యం అంద‌రికీ ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు.

AHA
Telugu Indian Idol 2
Soujanya Bhagvatula
Winner
Allu Arjun
  • Loading...

More Telugu News