Uttar Pradesh: ఆడుకుంటూ పామును కొరికి చంపేసిన బాలుడు

3 year old boy chews snake to death in Uttar Pradesh
  • ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో ఘటన
  • పామును కొరికి చంపాక స్పృహ కోల్పోయిన బాలుడు
  • సకాలంలో వైద్యం అందించడంతో తప్పిన ముప్పు
ఇంటి బయట ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడు అక్కడ కనిపించిన పామును చేత్తో పట్టుకుని నోటితో కొరికి చంపేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కొత్వాలి మహ్మదాబాద్ ప్రాంతంలోని మద్నాపూర్‌కు చెందిన దినేశ్‌సింగ్ మూడేళ్ల కుమారుడు శనివారం ఆరుబయట ఆడుకుంటున్న సమయంలో ఓ పాము అతడి వైపుగా వచ్చింది. 

దానిని ఒడుపుగా పట్టుకున్న బాలుడు నోట్లో పెట్టుకుని కొరికి చంపేశాడు. ఆ తర్వాత స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంట చనిపోయిన పామును కూడా పట్టుకెళ్లారు. వెంటనే వైద్యులు చికిత్స అందించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
Uttar Pradesh
Farrukhabad
Madnapur village

More Telugu News