Amazon: డ్యామేజ్డ్ ప్రొడక్టులను ఇకపై డెలివరీ చేయరట.. ఏఐ సాయం తీసుకుంటున్న అమెజాన్!

Amazon will no longer send you damaged products will use AI technology to check products before shipping

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో షిప్ కు ముందు తనిఖీ
  • గోదాముల్లో ఆటోమేషన్ వినియోగానికి నిర్ణయం
  • మంచి కండీషన్ లో డెలివరీ చేసేందుకు చర్యలు

ఈ కామర్స్ లో ఆర్డర్ చేయగా, దెబ్బతిన్న స్థితిలో (డ్యామేజ్డ్) వాటిని డెలివరీ చేసే సంఘటనలు ఎన్నో కనిపిస్తుంటాయి. కానీ, ఇకపై అమెజాన్ లో ఇలాంటివి ఉండకపోవచ్చు.  నేడు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్న టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ఈ సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలని అమెజాన్ అనుకుంటోంది. తద్వారా కస్టమర్లు తాము ఆర్డర్ చేసిన వాటిని మంచి కండీషన్ లో పొందే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. 

ఉత్పత్తులను షిప్ చేయడానికి ముందే వాటిని ఏఐ సాయంతో స్కాన్ చేయనుంది. అమెజాన్ గోదాముల్లో మరింత ఆటోమేషన్ చేయనుంది. ప్రస్తుతం అమెజాన్ ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్లలో ఉద్యోగులే వాటిని తనిఖీ చేస్తున్నారు. చిన్న చిన్న డ్యామేజ్ లను వారు గుర్తించలేకపోతున్నారు. ఇకపై ఏఐ ఆధారిత మెషిన్లు ఈ పనిచేస్తాయి. మెషిన్లు అయితే సూక్ష్మంగా, క్షుణంగా తనిఖీ చేయడానికి అవకాశం ఉంటుంది. అమెజాన్ అనే కాదు, ఈ కామర్స్ కంపెనీలు చాలా వాటికి ఇదే సమస్య నెలకొంది. షిప్ చేసే ముందు స్కాన్ చేస్తే సరిపోతుందా? రవాణాలో అవి డ్యామేజ్ అయితే ఏంటి పరిస్థితి? దీనికి కూడా అమెజాన్ పరిష్కారం కొనుగొనాల్సి ఉంది.

Amazon
damaged products
AI technology
pre check
good condition
  • Loading...

More Telugu News