Wrestlers: బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయకుంటే...: రాకేశ్ టికాయత్ హెచ్చరిక

Govt Must Arrest Brij Bhushan says Rakesh Tikait

  • బ్రిజ్ ను 9వ తేదీలోగా అరెస్ట్ చేయాలని హెచ్చరిక
  • రెజ్లర్ల డిమాండును ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్
  • అరెస్ట్ చేయకుంటే దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామన్న టికాయత్

భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ ను జూన్ 9వ తేదీలోగా అరెస్ట్ చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ డిమాండ్ చేసింది. బ్రిజ్ ను అరెస్ట్ చేయకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనను ఉద్ధృతం చేస్తామని ఆ సంస్థ నాయకుడు రాకేశ్ టికాయత్ హెచ్చరించారు. 

రెజ్లర్ల డిమాండును ప్రభుత్వం పరిష్కరించాలని, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ ను జూన్ 9లోగా అరెస్ట్ చేయాలన్నారు. లేదంటే తాము జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షకు దిగుతామన్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు ఆందోళన చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది.

Wrestlers
rakesh
  • Loading...

More Telugu News