Ram Charan: బంగారు తెలంగాణను నిజం చేసుకుంటున్నామన్న రామ్ చరణ్

Ram Charan wishes Telangana people on formation day
  • 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ
  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది వేడుకలు
  • ఈ పదేళ్లలో ఎంతో పురోగతి సాధ్యమైందన్న చరణ్  
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లవుతోంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రం రూపుదాల్చి పదేళ్లు అవుతోందని, ఈ పదేళ్లలో ఎంతో పురోగతి సాధ్యమైందని తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నామని రామ్ చరణ్ పేర్కొన్నారు. దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు చెబుతున్నానని వెల్లడించారు. పార్లమెంటు ఉభయ సభలలో బిల్లు ఆమోదం తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సంగతి తెలిసిందే.
Ram Charan
Formation Day
Telangana

More Telugu News