Amit Shah: ఏపీ పర్యటనకు అమిత్ షా, జేపీ నడ్డా

Amit Shah and JP Nadda coming to AP

  • వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు
  • అప్పుడే ప్రారంభమైన ఎన్నికల సందడి
  • ఈ నెల 8న అమిత్ షా, 10న జేపీ నడ్డా రాక

వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. కానీ అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలయింది. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. తమ అభ్యర్థుల పేర్లను కూడా పార్టీలు ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేతలు ఏపీపై ఫోకస్ పెట్టారు. రాష్ట్ర పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. 

ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖకు వస్తున్నారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న అమిత్ షా... బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ నెల 10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతికి రానున్నారు. ఇంకోవైపు జనసేనతో పొత్తు కొనసాగుతోందని బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జననేన అధినేత పవన్ చెపుతున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే యోచనలో పవన్ ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై బీజేపీ నుంచి ఇంత వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Amit Shah
JP Nadda
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News